
సాదిక్ అలీ సంస్మరణ సభలో పలువురు వక్తలు
జనం న్యూస్ కల్లూరు /ఖమ్మం జిల్లా బ్యూరో అక్టోబర్ 26
సామాజికంగా తోపుడు బండి ఫౌండేషన్ అధినేత దివంగత సాధిక్ అలీ ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కవులు విద్యావేత్తలు అన్నారు ఆదివారం స్థానిక కాళోజీ నగర్ లో దివంగత తోపుడు బండి సాదిక్ అలీ సంస్మరణ సభ జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తలు ప్రసంగిస్తూ సాదిక్ అలీ తోపుడు బండి పౌండేషన్ స్థాపించి రాష్ట్రంలోని హైదరాబాద్ వరంగల్ ఖమ్మం తదితర జిల్లాలలో అనేక ప్రాంతాలలో యాత్ర చేసి విజ్ఞాన దాయకమైన పుస్తకాలు పంపిణీ చేసి ఎంతో మంది విద్యార్థినీ విద్యార్థులకు జ్ఞానోదయం కలిగించారన్నారు ఇంకను నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు విద్యారంగంలో రాణించే విధంగా సెల్ఫోన్లు ల్యాప్టాప్లు అందించారని ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు దుస్తులు నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ బ్యాగులతో పాటుగా వారికి అవసరమైన ఆర్థిక సహకారం అందించారన్నారు ఎంతోమంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు ఆర్థిక సహకారం కూడా అందించారన్నారు సాదిక్ అలీ కుటుంబ పరంగా లాభపేక్ష లేకుండా సామాజిక సేవకే ఆయన జీవితం అంకితం చేశారన్నారు తన సేవలు ద్వారా పేదలు హృదయాల్లో నిలిచిన ఆదర్శనీయుడుగా కవిగా పాత్రికేయునిగా కూడా సమాజానికి ఎన్నో సేవలందించి రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు పొందిన వారిలో సాదిక్ అలీ ఒకరని వారు తెలిపారు పేద విద్యార్థులు ఉన్నత విద్యలు రాణించేలా తోపుడు బండి సంస్థ తరఫున ఆర్థికంగా చేయూతను ఇచ్చారని వక్తలు తెలిపారు కరోనా సమయంలో పేదలకు అన్నదానం వైద్య సహాయం కూడా అందించారని గిరిజన ప్రాంతాల్లో పేదలకు తమ సేవలను విస్తరింప చేశారని అన్నారు ఈ సందర్భంగా సాదిక్ అలీ సేవలను గుర్తిస్తూ ఆయనతో ఉన్న అనుబంధమును నెమరు వేసేందుకు ఖమ్మం జిల్లా కవి మిత్రులు తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో రూపొందించిన సంస్మరణ సంచికను వారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సాదిక్ అలీ చిత్రపటానికి పలువురు కవులు విద్య సామాజిక వేత్తలు వివిధ రాజకీయ పార్టీల నాయకులు కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు అభిమానులు పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గురుకుల విద్యాలయ సంస్థ విశ్రాంతి అధికారి ఎం పుల్లయ్య బంధుమిత్రులు ఫయాజ్ అలీ రియాజ్ ప్రముఖ కవి కపిల రామ్ కుమార్ కుటుంబ సభ్యులు ఉష సాధి బున్నీసా సలీం డాక్టర్ ఆషా సహనం ఉష కిషోర్ దత్తు సుజాత నాయకులు తోటకూర శేషగిరిరావు పసుమర్తి చందర్రావు తక్కెళ్ళ పాటి దుర్గాప్రసాద్ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి దామల దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

