సబ్ టైటిల్ :పేలుళ్లతో ప్రజలను భయపెడుతున్న యజమాన్యలు
జనం న్యూస్ జనవరి 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
మల్లారం లో ఉన్న క్రషర్లు
గ్రామ ప్రజలను చాల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు . క్రెషర్ల యజమాన్యం కు గ్రామ ప్రజలు చాల సార్లు వెళ్లి బ్లాస్టింగ్ పై అభ్యంతరాలు తెలిపారు.అయినా కాని యజమాన్యం పట్టించుకోవడం లేదు. ఇష్టం వచ్చిన తీరుగా రిగ్ బ్లాస్టింగ్ లేపడం జరుగుతుంది. చాలా రోజుల కింద ఇలాగే జరగడం వల్ల అధికారుల దృష్టికి తీసుకెళితే బ్లాస్టింగ్ పై యజమాన్యం వెనుకకు తగ్గింది.
మళ్లీ యజమాన్యం పాత పద్ధతిని అవలంబిస్తుంది గ్రామ ఇండ్లలో ఉన్న ప్రజలు మరియు బావిల కాడా ఉన్న రిగ్గు బ్లాస్టింగ్ వల్ల చాల ఇబ్బందులు పడుతున్నారు చాలా నష్టపోతున్నారు. మళ్లీ ఎప్పుడు రిగ్గు బ్లాస్టింగ్ లేపకుండా బ్లాస్టింగ్ పై నియంత్రణ తీసుకోవాలని సంబంధిత అధికారులను గ్రామ ప్రజలు కోరడం జరుగుతుంది