
జనం న్యూస్ 27 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణం స్థానిక ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ సమీపంలోని ఓ ప్రైవేటు బిల్టింగ్లో నిర్వహించిన పేకాట స్థావరంపై రెండో పట్టణ పోలీసులు ఆదివారం సాయంత్రం దాడి చేశారు. ఈ మేరకు పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని, వారి నుంచి 5 సెల్ ఫోన్లు, రూ.21,830 స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిపై కేసు నమోదు చేశామన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.