
సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు
దిగ్వాల్ గ్రామంలో డేంజర్ కెమికల్ కంపెనీపై ప్రజల ఆగ్రహం జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ గ్రామంలో ఉన్న ఫిరమిల్ అనే కెమికల్ కంపెనీ నుంచి వెలువడుతున్న ప్రమాదకర రసాయనాల వల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. చేతులు, కాళ్లు సన్నబడి కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు.
గ్రామస్తులు పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. లంచాల బారిన పడి కంపెనీ యథేచ్ఛగా కార్యకలాపాలు కొనసాగిస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత అధికారులదే అని గ్రామస్తులు హెచ్చరిక చేశారు.సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ అన్నారు