
నందలూరు నందు గల మహాత్మ జ్యోతి భాఫులే ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాల నందలూరులో సెకండ్ ఇయర్ ఎం.పి.సి చదువుతున్న విద్యార్థిని ఎస్.నిత్య ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో తన ప్రతిభ చూపి డిస్క్ త్రో మరియు షాట్ పుట్ విభాగంలో హర్యానాలో జరుగునటువంటి జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైనట్లు మరియు ఫస్ట్ ఇయర్ సి.ఈ.సి చదువుతున్న టువంటి కె.మానస కాంస్య పతకాన్ని సాధించిందని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. నాగేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ విద్యార్థినులకు నీట్ మరియు జేఈఈ ప్రవేశాలకు ఈ పతకాలు ఉపయోగపడతాయని అలాగే మా పాఠశాల మరియు కళాశాల విద్యార్థినులను చదువులకే కాకుండా క్రీడలకు కూడా పెద్ద పీట వేస్తుందని ఆమె అన్నారు. విద్యార్థులకు మంచి శిక్షణ అందించి పాఠశాల మరియు కళాశాల పేరును రాష్ట మరియు జాతీయ స్థాయిలకు చేరుతున్న వ్యాయామ ఉపాధ్యాయురాలు కె.జి సునీత ను ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బంది మరియు తల్లిదండ్రులు అభినందించారు.