
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 27
తర్లుపాడు లో వెలసిన శ్రీ గంగాభవాని పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి ఆలయం అభివృద్ధికి పలువురు దాతలు పెద్ద మొత్తంలో విరాళాలు అందించారు. ఈ విరాళాలతో ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన పనులను పూర్తి చేసినట్టు ఆలయ ధర్మకర్త నేరెళ్ల కార్తీక్ తెలిపారు. దాతలకు దేవస్థానం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య విరాళాలు, దాతల సహకారం తో గర్భగుడి తలుపులు ₹45,000 తో తర్లుపాడు వాస్తవ్యులు వాడేల కృష్ణ ప్రసాద్ శర్మ, సొసైటీ బ్యాంక్ మేనేజర్,స్వామివార్ల పీఠం ₹30,000 తో మార్కాపురం వాస్తవ్యులు రామడగు సుబ్బారావు,స్వామి వారికి ఇత్తడి ముఖ కవచం ₹30,000 తో హైదరాబాద్ వారు పోలేపల్లి వెంకట శ్రీధర్ బాబు (నారాయణ కుమారుడు),ఆలయ ధర్మకర్త అయిన నేరెళ్ల కార్తీక్ కు అందజేశారు నేరెళ్ల కార్తీక్ మాట్లాడుతూ, దేవాలయ పనులకు చేయూతనందించిన దాతల ఉదారత అభినందనీయమన్నారు. దాతలందరికీ స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. ఈ విరాళాలు ఆలయ అభివృద్ధికి, నిత్యకైంకర్యాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.