
జనం న్యూస్ అక్టోబర్ 27 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మునగపాక మండల ప్రాంతం మల్లవరం లో వెలసియున్న శ్రీ దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ముందుగా ఆలయ కమిటీ ఎమ్మెల్యేకు సాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం, దొడ్డి శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు కొయిలాడ దశావతారం,మల్ల నూక నర్సింగరావు, కాండ్రేగుల నూక అప్పారావు, హరికృష్ణ, ఆడారి గణేష్ తదితరులు పాల్గొన్నారు.