జనం న్యూస్ జనవరి 30కాట్రేనికోన లో పలువురు టిడిపి కార్యకర్తల కుటుంబాల ను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) గురువారం పరామర్శించారు. కాట్రేనికోన కు చెందిన టిడిపి నాయకులు మోకా అప్పాజీ సోదరుడు స్వామీజీ ( చంటి ) భార్య ఉష హఠాన్మరణం చెందగా ఆయన కుటుంబ సభ్యులను,అడవి పేట గ్రామానికి చెందిన జనిపల్లి ధన బాబు ఇటీవల గాయపడగా అతనిని, అడవి పేటకు చెందిన కాశి జనార్దన రావు,సిహెచ్ ప్రసాద్, రాజానగరం గ్రామానికి చెందిన పాలెపు వీర్రాజు ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) గురువారం పరామర్శించారు. ఆయన వెంట చెయ్యేరు సర్పంచ్ చెల్లి సురేష్, నీటి సంఘం వైస్ డిసి వాసంశెట్టి రాజేశ్వరరావు, జంగాశ్రీనివాస్, కె.సత్యప్రసాద్, మోకా బాల ప్రసాద్, శీలంసూర్యనారాయ ణ, ఉరం కృష్ణ ,బండి శ్రీను, కాశీ విశ్వనాథ్ తదితరులు ఉన్నారు.