
(జనం న్యూస్ చంటి అక్టోబర్ 27)
దౌల్తాబాద్, అక్టోబర్ 27: దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామంలో శివాలయం అభివృద్ధి పనులకు గ్రామస్థుడు పంజాల లింగ గౌడ్ గొప్పమనసుతో ముందుకు వచ్చాడు. గ్రామ దేవాలయం అభివృద్ధి కోసం తనవంతు సహాయంగా రూ.10,000/-ను దేవాలయ కమిటీకి అందజేశాడు.లింగ గౌడ్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా, సుఖశాంతులతో ఉండడం భగవంతుని కృప ఫలితమని చెబుతూ, ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, భక్తులు పాల్గొని లింగ గౌడ్ యొక్క సేవాభావాన్ని అభినందించారు. దేవాలయ కమిటీ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.