
ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్, అక్టోబర్ 27 (జనం-న్యూస్):
అర్ధవీడు మండలం, కాకర్ల గ్రామ పంచాయతీ కాకర్ల గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ గిద్దలూరు ఇంచార్జ్ కేపీ నాగార్జున రెడ్డి.కార్యక్రమంలో మండల ఎంపీపీ మేడూరి వెంకట రావు, అర్ధవీడు మండల కన్వీనర్ యేరువ రంగారెడ్ది, ప్రకాశం జిల్లా వైసీపీ ఆర్టీఐ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ కదం పవన్ కుమార్, ఎంపీటీసీ పెరిక గౌరి, మాజీ సర్పంచ్ ఉడుముల చిన్న వెంకట రెడ్ది, మాజీ ఎంపీటీసీ నారు ఆది నారాయణ రెడ్డి, మాజీ జేసీఎస్ కన్వీనర్ యేరువ కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు కుందురు కొండారెడ్డి, గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.
