 
    
జనం న్యూస్ అక్టోబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపొర గ్రామంలో ముమ్మిడివరం సి.ఐ. ఎం.మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్.ఐ. ఐ.అవినాష్ లు స్థానిక రెవిన్యూ అధికారులతో కలసి గ్రామస్తులతో సమావేశమయ్యారు. తీర ప్రాంతం కావడంతో తుఫాను ప్రభావితం ఎక్కువగా ఉంటుందని, తక్షణమే ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళవలసింది గా సూచించారు.తాము తమ నివాశ గృహాలను వదిలి రామంటున్న ప్రజలకి పోలీసులు నచ్చచెప్పి గచకయలపొర తుఫాను షెల్టరుకు తరలించినారు. [గచ్చకాయల పోరా గ్రామ పరిధిలో ఉన్న నక్కపల్లి పరిసర ప్రాంతాలు నుండి సుమారు 200 మందిని గచ్చకాయలపొర లో ఉన్న సైక్లోన్ షెల్టర్లుకు ముమ్మిడివరం సీఐ మోహన్ కుమార్, కాట్రేనికోన ఎస్సై ఐ అవినాష్ ఎంపిడిఓ వెంకటచలం,ఇతర సిబ్బంది తరలించడం అయ్యింది

