
జనం న్యూస్ అక్టోబర్ 28 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలోని జగ్గంపేట గ్రామ ఐ కే పి పిపిసి సెంటర్ను ఏవో రాజశేఖర్ సందర్శించడం జరిగింది.వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని రైతులు ఆరబెట్టుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా తడిచిన వడ్లు మొలకెత్తకుండ 50 గ్రా. ఉప్పు లీటరు నీటికి( 5% ఉప్పు ద్రావణం) కలిపి పిచికారి చేయాలని సూచించారు. అదేవిధంగా 2,3 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు వరి కోత తాత్కాలికంగా ఆపివేయాలని సూచించారు.రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లోనే ధాన్యం అమ్మాలని సూచించారు.ధాన్యంలో తేమ శాతం 17% మించి ఉండరాదని, ధాన్యం ఆరిన తర్వాత తాళ్ళు, మట్టి పెళ్ళాలు లేకుండా నాణ్యమైన వితానాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ అనిత, సెంటర్ ఇన్చార్జి అశోక్ మరియు రైతులు మాణిక్యం రెడ్డి, సాయిలు నర్సింలు తదితరులు పాల్గొన్నారు