
జనం న్యూస్ అక్టోబర్ 28 సంగారెడ్డి జిల్లా:
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ఎ మ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి మంగళవారం కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఆలయ సంప్రదాయరీతిలో ఘనస్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు ఆయనకు స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను, స్వామివారి చిత్రపటానికి బహూకరించారు. ఈ కార్యక్రమంలో అయన సతీమణి బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి తదితరులు ఉన్నారు.