
జనం న్యూస్ 29అక్టోబర్ పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామానికి చెందిన ఉరుమళ్ళ ఎల్లారెడ్డి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి మృతి చెందగా, విషయం తెలుసుకున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మంగళవారం ఎల్లారెడ్డిభౌతికకాయానికినివాళులర్పించి, మృతుని కుమారులు ఉరుమళ్ల వేణు, కిరణ్ లను వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో మాజీ మంత్రి వెంట మాజీ సర్పంచ్ తాటిపర్తి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు కృష్ణ హరి, ఇప్ప మహిపాల్ రెడ్డి, పెయ్యాల రాజు, ఇప్ప గంగారెడ్డి, పెయ్యాల నరసింహారెడ్డి, మాధవరెడ్డి, మౌలానా, ఉపేందర్ రెడ్డి, లింగారెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు పెగడపల్లి మండల అధ్యక్షులు పెగడపల్లి గ్రామ రెడ్డి సంఘం ఉపాధ్యక్షులు కాసం శ్రీనివాస్ రెడ్డి, తదితరులు ఉన్నారు.