
జనం న్యూస్ 29 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మెంటాడ మండలంలో మొంధా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో వరద నీరు ఆండ్ర రిజర్వాయర్లోకి అధికంగా చేరింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రిజర్వాయర్ స్టీల్వై గేట్ల ద్వారా చంపావతి నదిలోకి ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేయడం కొనసాగుతోంది.ఈ క్రమంలో చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తూ ఆండ్ర సచివాలయం పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి వెళ్లే రహదారిపై నీటి ప్రవాహం పెరగడంతో అక్కడి పరిస్థితిని స్పెషల్ ఆఫీసర్ ప్రమీల గాంధీ ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో మండల తహసీల్దార్ అరుణకుమారి, ఆండ్ర ఎస్సై కె. సీతారాం, వి.ఆర్.ఓ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.