
జనం న్యూస్ అక్టోబర్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ కె.పి.హెచ్.బి డివిజన్ మాజీ అధ్యక్షులు మందలపు సాయి బాబు చౌదరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మరియు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ మరియు శేర్లింగంపల్లి శాసనసభ్యులు గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు అనుమల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా మందలకు సాయిబాబు చౌదరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి అదేవిధంగా కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో కెపిహెచ్బి కాలనీ డివిజన్ని,అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది సాయిబాబు చౌదరితోపాటు గాదెల అనిల్ కుమార్, వాసు రెడ్డి సుధీర్, దొప్పలపూడి రత్నాకర్, చిలుకూరి గోవిందరాజు, వాసిరెడ్డి ప్రదీప్,మన్నే సుబ్రహ్మణ్యం, కాజా నవీన్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
