
జనం న్యూస్ అక్టోబర్ 29:
మోడ్రన్ కబడ్డీ రాష్ట్ర అధ్యక్షులు కుంభం రామ్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరే తిరుపతి ఆధ్వర్యంలో జగిత్యాల లో నిర్వహించిన జనరల్ బాడీ మరియు రిఫరీ అభివృద్ధి, మోడ్రన్ కబడ్డీ పై క్రీడాకారులకు అవగాహన సదస్సు ల నిర్వహణ గురించి పలు సూచనలు చేయడం జరిగింది . ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పసుల లక్ష్మణ్ ను జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కల రాజబాబు లకు నియామక పత్రాలు అందజేయడం జరిగింది అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పక్కల రాజబాబు మాట్లాడుతూ జిల్లా నుండి ఉత్తమ క్రీడాకారులను తయారు చేస్తామని అన్నారు తమ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు కుంభం రామ్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆరే తిరుపతి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నుండి జంగిడి వినీత్ లావుడియా సారయ్య బొక్క శ్రీధర్ గంగారాం శ్రీనివాస్ నాయక్ బుర్ర శివ తదితరులు పాల్గొన్నారు