
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలంలోని బస్టాండ్ నుంచి నీలి పల్లె వెళ్లే రహదారిలో ఉన్నటువంటి గణేష్ నగర్ విద్యానగర్ పరిసర గృహాలలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన వర్షపు నీటిని తొలగించేందుకు ఎంపీడీవో ఆధ్వర్యంలో నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నివాసాల మధ్య ఉన్నటువంటి వర్షపు నీటిని బుధవారం తొలగించేందుకు మోటార్ ఏర్పాటు చేసి తొలగించేందుకు పంచాయతీ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది శివ, హరి నాగరాజు డి ప్రసాద్ డి,కుమార్ తదితరులు పాల్గొన్నారు
