
జుక్కల్ అక్టోబర్ 29 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూసోయా ధాన్యం క్వింటాలు రూ.5,328/- ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.
కావున రైతులందరూ సోయా ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని..
దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్. మార్కెట్ కమిటీ చైర్మన్ శైలజ రమేష్. మద్నూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిలు. సలాబత్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్, చెవుల వర హనుమాన్లు స్వామి. సొసైటీ సెక్రెటరీ బాబురావు. మనోహర్ దేశాయ్. బసవంతరావు. గంగాధర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు

