
జనం న్యూస్ అక్టోబర్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
పరకాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొoథా తుఫాన్ భారీ వర్షాలు కురిసిన సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు 2వ వార్డులో ఇండ్ల పర్యవేక్షణ చేసి వార్డులోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చిన్న పెద్ద తేడా లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఇంట్లో నుంచి బయటికి రావద్దని అన్నారు పాత మట్టిగోడలు వర్షాల వల్ల తడిసి కులకుండా తగు జాగ్రత్తలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్, రాష్ట్ర ఎస్సీ విభాగం ఉపాధ్యక్షులు మడికొండ శ్రీను, పరకాల ఏఎంసీ డైరెక్టర్ బొమ్మకంటి రుద్రమదేవి చంద్రమౌళి, పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యులు చందుపట్ల రాఘవరెడ్డి, పరకాల పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుల రమేష్, బొచ్చు మోహన్, దార్న వేణుగోపాల్, సుధమల్ల కిషోర్, చెరుపెల్లి సదయ్య తదితరులు పాల్గొన్నారు….