
జనం న్యూస్ అక్టోబర్ 30 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
మోంతా తుఫాను భారీగా మూడు రోజులుగా కురిసిన వర్షాల వల్ల కొత్తూరు పంచాయతీ రైల్వే అండర్ బ్రిడ్జి దేవినగర్ వద్ద దొంగ గడ్డ నుండి భారీ ప్రవాహం రావడంతో చెట్టుకొమ్మలు చెత్తలో వంటివి చేరుకోవడంతో శారదా నదిలోకి నీటి ప్రవాహం వెళ్లకపోవడంతో సత్యనారాయణపురం మూలపేట గ్రామాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని మాజీ శాసన మండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరరావు దృష్టికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలియజేసిన పిదప అధికారులతో మాట్లాడి ఈరోజు ఉదయం శారద నగర్ లో ఉన్న అండర్ బ్రిడ్జి వద్దకు చేరుకొని జెసిబి తో నీటి ప్రవాహం వెళ్లే విధంగా అక్కడ ఉన్న చెట్టుకొమ్మలు చెత్తలు తొలగించి నీటి ప్రవాహం శారదా నదిలోకి వెళ్లే విధంగా గ్రామ ప్రజల సమక్షంలో నాగ జగదీష్ దగ్గర ఉండే పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా నాగ జగదీష్ మాట్లాడుతూ గతంలో తుఫానుల వల్ల ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగేదని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తుఫాన్లు ఎదుర్కోవడంలో తనకు ఉన్న పరిజ్ఞానాన్ని సాంకేతికను అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని నిరంతరము పర్యవేక్షణ వల్ల ప్రాణ నష్టం జరగకుండా నివారించగలిగారని, రైతాంగం నష్టపోయిన వరి పంటకి అధికార యంత్రాంగం పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకునే చర్యలు చేపడతారని వ్యవసాయ అధికారులు వచ్చినప్పుడు మీ పంట పొలాల దగ్గరకు జరిగిన నష్టాన్ని వివరించాలని నాగ జగదీష్ రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సప్పరపు ప్రసన్న లక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకులు మేడిశెట్టి సత్తిబాబు బర్ల నాగరాజు మాజీ ఎంపీటీసీ కోన శ్రీనివాసరావు వర్మ మేడిశెట్టి నూకరాజు నాగిరెడ్డి శ్రీనివాసరావు గజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.//