
జనం న్యూస్ అక్టోబర్ 30 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలందరూ పెద్ద ఎత్తున తమ మద్దతు తెలియజేస్తున్నారని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాబై వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. మహిళలు యువకుల మద్దతు కాంగ్రెస్ కి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా రమేష్ గురువారం వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నవీన్ యాదవ్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పాలనపై ధ్వజమెత్తారు ఆ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు దోచుకు తిన్నారని విమర్శించారు ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని నిర్ణయించుకున్నారన్నారు .ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు.
