
ఆన్లైన్ సైబర్ నేరాలకు నిరోధించడానికి 1930,టోల్ ఫ్రీ నెంబర్.
జనం న్యూస్,అక్టోబర్ 30,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని భీమ్రా గ్రామానికి చెందిన హేమలత చంద్రకాంత్ గౌడ్,దంపతులు సైబర్ నేరాలపై ప్రశిక్షణను బుధవారం మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తరగతులు ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వర్ రావు,పిటిసి ప్రిన్సిపల్ మధుకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాసంస్థలలో యువకులకు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు. కంగ్టి మండలానికి చెందిన హేమలత చంద్రకాంత్ గౌడ్,ఇద్దరు దంపతులు ప్రశిక్షణ ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబర్ నేరం అంటే కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ వంటి నెట్వర్క్ చేయబడిన పరికరాలను లక్ష్యంగా చేసుకుని లేదా, ఉపయోగించి చేసే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు.ఈ నేరాలలో ఆర్థిక మోసాలు,వ్యక్తిగత సమాచారం దొంగిలించడం, కంప్యూటర్ వ్యవస్థలను పాడుచేయడం వంటివి ఉంటాయని అన్నారు.సైబర్ నేరాల ఫిషింగ్ మోసపూరిత ఇమెయిల్‌లు, వెబ్సైట్ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం.మాల్వేర్ కంప్యూటర్లలోకి హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టడం.సైబర్ స్టాకింగ్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎవరైనా ఒకరిని వేధించడం,వెంటాడటం, దాడులు,డిస్ట్రిబ్యూటెడ్ డేనియల్ అఫ్ సర్వీస్ ట్రాక్స్,ఒక వెబ్‌సైట్‌ను లేదా,సర్వర్‌ను పని చేయకుండా నిలిపివేయడానికి భారీ సంఖ్యలో అభ్యర్థనలను పంపడం.ఆన్లైన్ మోసాలు,ఆన్లైన్ ఫ్రాడ్స్, ఆన్లైన్లో నమ్మించి డబ్బులు కాజేయడం.సైబర్ నేరాల వల్ల కలిగే నష్టాలు అని అన్నారు.ఆర్థిక నష్టం సున్నితమైన సమాచారం బయటకు రావడం.సంస్థల ప్రతిష్ట దెబ్బతినడం. కంప్యూటర్ వ్యవస్థలు పనిచేయకపోవడం అని అన్నారు.సైబర్ నేరాలను ఎలా నిరోధించాలి?.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చిన లింక్‌లపై క్లిక్ చేయవద్దు అని అన్నారు.బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి, వాటిని తరచుగా మార్చండి,మీ ఆపరేటింగ్ సిస్టమ్, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌ను ఎల్లప్పుడూ అప్డేట్ చేయండి.ఆన్లైన్లో సున్నితమైన సమాచారాన్ని పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మీరు సైబర్ నేరానికి గురైనట్లు భావిస్తే, వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చెయ్యాలని అన్నారు. చట్టపరమైన చర్యలు భారతదేశంలో సైబర్ నేరాల కేసులను ఐటీ చట్టం,2000 2008లో సవరించబడిందని అన్నారు.సైబర్ ట్రాకింగ్ నేరాలకు సెక్షన్ 354(డి),509 ఐపీసీ, సెక్షన్ 67 కింద శిక్షలు ఉంటాయని అన్నారు.
వివిధ సైబర్ నేరాలకు సెక్షన్ 66 ప్రకారం 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా ₹5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు అని అన్నారు.సైబర్ నేరాలకు గురి అయిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.