
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 30 రిపోర్టర్ సలికినీడి నాగు
భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు గురువారం మరియు కోటి సోమవార పూజ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది . కార్తీక మాసంలో భాగంగా ప్రతిరోజు 108 శివలింగాలకు మహా కాల రుద్ర అభిషేకం నిర్వహిస్తూ ఉన్నారు, ఈ రుద్రాభిషేక కార్యక్రమంలో షిరిడి శ్రీ దత్త సాయిరాం అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నిత్యాన్నదాన సత్ర నిర్వాహకులు మద్ది రమేష్ పాల్గొని ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం షిరిడీ నుండి తీసుకువచ్చిన సాయి సచ్చరిత్ర గ్రంథాలను దత్త సాయి నిర్వాహకులు కి అందజేశారు, అనంతరం విప్పర్ల అంజిరెడ్డి ఆదిలక్ష్మి దంపతుల సహాయ సహకారాలతో ఈరోజు అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, ట్రస్టు నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రం వచ్చిన రోజున కోటి సోమవార వ్రతం రోజు అని ఈ రోజున చేసే దానానికి పూజా కార్యక్రమాలకి విపరీతమైన పుణ్యఫలం వస్తుందని గురువారం రోజున ఈ కోటి స్వామివారి వ్రత పూజ రావడం చాలా విశేషమని సద్గురు సన్నిధిలో జరిగే 108 శివలింగాలకు భక్తుల గోత్రనామాలతో మహాకాల రుద్రాభిషేకం నిర్వహించామని తెలియజేశారు, ప్రతిరోజు ఉదయం 6:30 గంటలకు మహాకాల రుద్రాభిషేకం కాశీ నుంచి తీసుకొచ్చిన 108 శివలింగాలకు అభిషేకం జరుగుతుందని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో విప్పర్ల అంజిరెడ్డి ఆదిలక్ష్మి మద్దుల ప్రసాద్ మద్ది రమేష్ ఫ్రెండ్ సర్కిల్ తదితరులు పాల్గొన్నారు