 
    
జనం న్యూస్ అక్టోబర్ 30( భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా న్యాయవాదుల కోసం “ఫోరెన్సిక్ సాక్ష్యం పై అవగాహన కార్యక్రమం – ఒక జ్ఞాన సమీక్ష” పేరుతో అవగాహన సదస్సు నవంబర్ 1, 2025 (శనివారం) ఉదయం 10:30 గంటలకు కొత్తగూడెం అడ్వకేట్స్ లైబ్రరీ హాల్లో జరగనుంది. ఈ కార్యక్రమం ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది.జిల్లా కన్వీనర్ గోపికృష్ణ మరియు మహిళా కన్వీనర్ సుంకర భానుప్రియ మాట్లాడుతూ “నేటి న్యాయ వ్యవస్థలో ఫోరెన్సిక్ మరియు శాస్త్రీయ సాక్ష్యాలు కీలకమైనవిగా మారాయి. న్యాయవాదులు ఈ రంగంలో అవగాహన పెంపొందించుకోవడం ద్వారా కేసుల పరిష్కారంలో మరింత సమర్థవంతంగా వ్యవహరించగలరు. ఈ కార్యక్రమం ప్రతి న్యాయవాదికి కొత్త దిశగా మారుతుంది” అని తెలిపారు.ఈ సదస్సులో డా. మోహన్ ఎర్రగోళ ఫౌండర్ & డైరెక్టర్ – ప్రోబ్ ల్యాబ్ ఫోరెన్సిక్, హైదరాబాద్, ప్రధాన వనరుల నిపుణుడిగా పాల్గొని ఫోరెన్సిక్ శాస్త్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనలతో అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా పాలీగ్రాఫిక్ & ఫింగర్‌ప్రింట్ టెస్టులు, నార్కో విశ్లేషణ, లై డిటెక్షన్, సంతకం పరీక్ష, డిజిటల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ల్యాబ్ విధానాలు, శాస్త్రీయ విశ్లేషణ పద్ధతులపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ ప్రధాన అతిథిగా, అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరిత గాల విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఇతర గౌరవనీయ న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.కార్యక్రమం విజయవంతం కావడానికి అడపాల మహాలక్ష్మి, సాధిక్ పాషా, ఎర్రపాటి కృష్ణ, యెర్రా కామేష్, అంబటి రమేష్, నరసింహ చారి, నీలవేణి, మారపాక రమేష్, వడ్లకొండ హరిప్రసాద్, అంకుష్ పాష, ఇందిరా ప్రియదర్శిని, ధరావత్ రాధాకృష్ణ, ఎర్ర శ్రీను తదితరులు కృషి చేస్తున్నారు.