
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో టంగుటూరు రోడ్ లో శుక్రవారం సాయంత్రం ఉరుసు మహోత్సవ నిర్వహణ కమిటీ అజం భాష,మహబూబ్ బాషా ఆహ్వానం మేరకు రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజుకి ఘన స్వాగతం పలికారు. అనంతరం అనంతరం వేడుకలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు సాధర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ నందలూరు మండలంలో ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం ఎంతో అందంగా ఉందని, ప్రతి వేడుక ఎంతో ప్రత్యేక మైనదని, ఉరుసు మహోత్సవ నిర్వహకులు ఎంతో గొప్పగా ఈ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ముస్తాక్ హుస్సేన్, నందలూరు మండల టిడిపి అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణు గోపాల్, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దుల విజయ సాగర్ సర్పంచ్ చుక్క యానాది సుధీర్ ,గీతాంజలి విద్యా సంస్థల అధినేత రమణ, ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు శివ, మోడపోతుల రాము గంగాధర్,సురేష్,సుబ్బ నరసయ్యా, నారప శెట్టి శివ,అల్తాఫ్,మస్తాన్,జానీ, రహీం, పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది.
