
సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ వీరేశం జనం న్యూస్ నవంబర్ 1
జహీరాబాద్ మండలంలో అలనా కంపెనీ వ్యర్థాలతో ప్రజలకు ఇబ్బందులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ మండలంలో ఉన్న అలనా మాంసం ఎగుమతి కంపెనీ నుండి వెలువడుతున్న వ్యర్థాలు స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. కంపెనీ పశువులను కట్ చేసి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తూ, ఉత్పత్తి అయ్యే రసాయన వ్యర్థాలు మరియు మాంసపు అవశేషాలు సరైన విధంగా శుద్ధి చేయకుండానే బయటకు వదలడం వల్ల చుట్టుపక్కల గ్రామాలలో దుర్వాసన వ్యాపించి ప్రజల జీవనాన్ని దుష్ప్రభావితం చేస్తోంది.ఈ సమస్యపై సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం అధ్యక్షుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, “అలనా కంపెనీ వ్యర్థాలను పర్యావరణ ప్రమాణాలు పాటించి శుద్ధి చేయకుండా వదలడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరం. ఈ వ్యర్థాలను తక్షణమే నిలిపివేయాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి ఆందోళన చేపడతాం” అని హెచ్చరించారు.స్థానిక ప్రజలు కూడా ఈ దుర్వాసనతో రోజువారీ జీవితం ఇబ్బందిగా మారిందని, చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాస సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. ప్రజలు అధికారులను వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.– జహీరాబాద్ ప్రతినిధి