
జనం న్యూస్ నవంబర్ 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
హరిహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి వారి మాల ధరించి నియమాలతో కూడిన దీక్షను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ఈ రోజు ఉదయం చేపట్టారు, కూకట్ పల్లీ వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి వారి దివ్యదర్శనము చేసుకొని అయ్యప్ప స్వామి ఆలయ అర్చకులు యోగి గురుస్వామి కైంకర్యములచే మాలను ధరించారు, అనంతరం వడ్డేపల్లి రాజేశ్వరరావు గురుస్వామి మాట్లాడుతూ…“అయ్యప్ప స్వామి భక్తి మనసుకు పవిత్రతను, ఆత్మశాంతిని ప్రసాదిస్తుందనీ. ప్రతి సంవత్సరం స్వామి వారి మాలధారణ ద్వారా శరీరం, మనసు, ఆత్మ శుద్ధి సాధించడానికి ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. నియమ నిష్ఠలతో దీక్షను ఆచరించడం ద్వారా జీవితంలో నియంత్రణ, క్రమశిక్షణ మరియు భక్తి పెంపొందుతాయి,” అని వారు అన్నారు.
