
జుక్కల్ నవంబర్ 01:-( జనం న్యూస్)
మహారాష్ట్రలోని పారిళి వైజానాథ్ శివాలయాన్ని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే దర్శించుకున్నారు.
జుక్కల్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యం, శాంతి, అభివృద్ధి కోసం పరమశివుడి దీవెనలు కోరుతూ పూజలు చేశారు
“జుక్కల్ ప్రజలపై శివయ్య కృప ఎల్లప్పుడూ ఉండాలి” అని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.15 ఏళ్లుగా కొనసాగుతున్న మహా అన్నప్రసాద సేవ బిచ్కుంద నుండి కపిల్దర్ మన్మథ స్వామి వరకు పాదయాత్రగా వచ్చే భక్తులకు గత 15 సంవత్సరాలుగా మహా అన్నప్రసాద సేవను మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే నిర్వహిస్తున్నారు.భక్తులకు భోజనాన్ని అందిస్తూ సేవా తత్వంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కొనసాగుతోంది.ఈ సేవ భక్తుల్లో సమానత్వం, సేవాభావం పెంపొందించడంలో ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది.భక్తసేవ శివసేవ భక్తులు అభిప్రాయపడుతూ “పాదయాత్రలో అన్నప్రసాదం మాకు శక్తిని ఇస్తుంది” అని తెలిపారు.ఈ కార్యక్రమం లో జుక్కల్ మద్నూర్ మండల పార్టీ అధ్యక్షులు బన్సీ పటేల్, జుక్కల్ మాజీ ఎంపీపీ బస్వంత్ రావు శెట్కార్, బొల్లి గంగాధర్, వేసారే రమేష్ పటేల్, రవి పటేల్, రాజశేఖర్ పటేల్, విట్టు పటేల్, శివాజీ పటేల్, కపిల్ పటేల్, కిరణ్, మారుతీ తదితరులు పాల్గొన్నారు.

