
జనం న్యూస్ నంబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన
జన జాతీయ గౌరవ దివస్ వేడుకలు శనివారం కాట్రేనికోన పంచాయతీ పరిధిలో ని చెంచుల గురువు గ్రామం నందు నిర్వహించారు. ఈ సందర్బంగా గిరిజన స్వాతంత్ర సమర యోధుల చిత్ర పటాలకు అధికారులు, పెద్దలు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తెలియజేశారు. వాటిని ఉపయోగించుకొని అభివృద్ధి చెందాలని పిల్లలను స్కూలుకు పంపి వారికి మంచి చదువులు చెప్పించడం ద్వారా పేదరికం నుండి బయటపడాలని కోరారు. స్థానికులు తమ గ్రామంలో రోడ్లు వేయాలని, ఇల్లు నిర్మించాలని, ప్రభుత్వం ద్వారా రాయితీపై వచ్చే లోన్లు అందించాలని, తమ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని, ఆరోగ్యశ్రీ కార్డులు ఇప్పించాలని కోరారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని నాగ శిరీష మాట్లాడుతూ తమ శాఖ ద్వారా గిరిజన సంక్షేమానికి కృషి చేస్తామని తదుపరి సమావేశానికి అందరూ అందుబాటులో ఉండి తమ సమస్యలను తమ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. మండలంలో ఎస్టీ కులానికి చెందని వారు కూడా ఎస్టీ సర్టిఫికెట్లు తీసుకుంటున్నానని అటువంటివి జరగకుండా తాసిల్దార్ దృష్టి పెట్టాలని ఎస్టి నాయకులు కోరారు. స్థానిక గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పట్ల సర్పంచ్ సుధాకర్ జిల్లా గిరిజన సంక్షేమ సాధికార అధికారిని శిరీష దృష్టికి తీసుకుని వెళ్లారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారు ల దృష్టికి తీసుకెళ్తానని ఆమె తెలిపారు. కార్యక్రమం లో జిల్లా గిరిజన సంక్షేమ సాధికార అధికారిని మోపిదేవి నాగ శిరీష, ఎంపీడీఓ ఎస్ వెంకటా చలం, తహసీల్దార్ రవి కిరణ్, సర్పంచ్ గంటి వెంకట సుధాకర్, వైస్ ఎంపీపీ సానబోయిన నాగేశ్వర రావు, ఎంపీటీసీ మోకా చంద్ర నాగరత్నం, హోసింగ్ ఏ ఈ వేణు, వెలుగు ఏ పి ఎం శ్రీనివాస్ రాజు,ఎం ఈ ఓ లు నామాల కృష్ణ మోహన్ ఎం వెంకట రమణ, ఎఫ్ డి ఓ చలపతి, పంచాయతీ కార్యదర్శి జే వి వి సత్యనారాయణ, ఎస్టీ యూనియన్ జిల్లా అధ్యక్షులు మాను పాటి గోవింద్, కాట్రేనికోన మండలం ఎస్టీ అధ్యక్షులు కే ప్రసాద్, కార్యదర్శి అరుణ్ కుమార్, జిల్లా కార్యదర్శి బండారు సత్యనారాయణ, కమ్మ సత్తి దుర్గా మల్లేశ్వర రావు, ఎస్టీ యూనియన్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సింగం శ్రీను, మండపేట ఎస్టీ యూనియన్ అధ్యక్షులు సింగం రాంబాబు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
