
జనం న్యూస్, నవంబర్ 1, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమైతే రాజ్యాధికారం సాధ్యమవుతుందని సిద్దిపేట జిల్లా టి ఆర్ పి అధ్యక్షుడు తుప్పతి బిక్షపతి అన్నారు, శనివారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుప్పతి బిక్షపతి మాట్లాడుతూ, తీన్మార్ మల్లన్న ఏర్పాటుచేసిన టి ఆర్ పి పార్టీకి రాష్ట్రంలో అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తుందని, కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పరిపాలన చూసి ప్రజలు విసుగెత్తిపోయారని, తీన్మార్ మల్లన్న వైపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని, టి ఆర్ పి లోకి వలసలు వివిధ పార్టీల నుంచి వస్తున్నాయని సిద్దిపేట జిల్లాలో టీ ఆర్ పి పార్టీ బలోపేతం అవుతుందని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టి ఆర్ పి విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.