అందనిధ్రక్షే.అధికారులనిర్లక్ష్యంతో గూడెం వాసులకు చుక్కేదురు
జనం న్యూస్ జనవరి 31 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని కండ్లపెల్లి గ్రామంలోని నాయకపుగుడెం లో దాదాపు 60 కుటుంబాలు నివాసం ఉంటారు .విరు దాదాపు 10 దశాబ్దాల నుండి వారి పూర్వీకులనుండి పురి గుడిసె లలో నివాసం ఏర్పాటు చేసుకోని గ్రామానికి 1 కిలో మీటరు దూరంలో ఉన్న అడవి ప్రక్కన నివాసం ఉంటున్నారు. వీరికి గ్రామానికి వచ్చే ప్రభుత్వ పతాకాల తాజాగా నిర్వహించిన. గ్రామ సభలో చూపెట్టిన లిస్టులో ఇందిరమ్మ ఇళ్లు.ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. నూతన రేషన్ కార్డులు.ఏ ఒక్కరి పేరు లేదు.దిని పై రెవెన్యూ పరిశీలకులు శ్రీనివాస్ వివరణా కోరిగా నాయికపు గుడెం గుడిసెలు రిజర్వ్ ఫారెస్ట్ కిందికి వస్తున్నాయి అని వీరికి ప్రభుత్వ పతాకాలు అందుత లేవని తెలిపారు. నాయికపు గుడెం 10 దశాబ్దాల నుండి వారి పూర్వీకులు పూరి గుడిసెల లో నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటూ గ్రామపంచాయతీలో లెక్కల ప్రకారం ఇండ్లు గ్రామపంచాయతీ వెబ్ సైట్ లో అన్ లైన్ లో ఉండి ఇంటి పన్నులు కడుతుంన్నప్పుడు అన్ లైన్ ప్రక్రియ చెసినప్పుడు అధికారులకు రిజర్వ్ ఫారెస్ట్ అని తెలియలేదా ఇప్పుడు ప్రభుత్వ పతాకాలు కోసం దరఖాస్తు చేసుకుంటే మీరు నివసిస్తున్న భూమి రిజర్వ్ ఫారెస్ట్ అని అధికారులు చేతులుదులుపు తున్నారు దశబ్దల కాలం నుండి గిరిజనులు వారి పూర్వికుల నుండి గ్రామానికి దూరంగా ఉండడంతో వారికి వచ్చే ప్రభుత్వ నిధులు అందకుంట గ్రామస్థాయి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని మరో ప్రక్క ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వారి ప్రచారాల కోసం మాగూడెం గుర్తుకు వస్తది.కానీ ప్రభుత్వ పథకాలంటే,అటు అధికారులకు, ఇటు నాయకులకు, గూడెంలోని ప్రజాలు గుర్తుకు రారని వాపోతున్నారు.ఇప్పటికైనా దయచేసి గూడెం వాసులకు ప్రభుత్వ పతాకాలు అందేలా చర్యలు తీసుకోవాలని నాయకుపు గుడెం ప్రజలు అధికారులను, నాయకులను, కోరుతున్నారు.