
బీసీలకు రిజర్వేషన్లు వచ్చేంతవరకు పోరాటం ఆగదు నిరటి రాజ్ కుమార్
జనం న్యూస్ 01నవంబర్ పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర బీసీ జేఏసీ ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నీరటి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొని మాట్లాడుతూ బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేంతవరకు బీసీలలో పోరాటం ఆగదని మేము ఎంతో మాకు అంత రిజర్వేషన్ కల్పించే వరకు పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ రిజర్వేషన్ల ప్రక్రియను నైన్త్ షెడ్యూల్లో చేర్చి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు నిర్వహించే రిలే నిరాహార దీక్షలకు పార్టీలకతీతంగా బీసీ నాయకులు మద్దతు ప్రకటించి భాగస్వాములు కావాలని అన్నారు ఈ రిలే నిరాహార దీక్షకు పెగడపల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్ మెరుగు శ్రీనివాస్ ప్రకటించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు నెల్లి మల్లేశం ఉప్పు రవి బండారి బీరయ్య ముల్క రాజేశం తౌటు గంగాధర్ చిందం తిరుపతి గంగుల కొమురెల్లి గర్వంద శేఖర్ గౌడ్ చెట్ల రాజు తిరుమలి నరసింహారెడ్డి కడారి తిరుపతి గొల్లపల్లి రామచంద్రం బొడ్డు రమేష్ పెద్ది బీరయ్య గొల్లపల్లి నాగరాజు ఆడెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.