
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి..
జనంన్యూస్.నిజామాబాద్, నవంబర్ 1.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఈ.ఆర్.ఓలతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ, 2002 ఎలక్టోరల్ జాబితాతో నియోజకవర్గాల వారిగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి 4 కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. మొదట కేటగిరి "ఎ" జాబితాను బి ఎల్ ఓ యాప్ ద్వారా నిర్ధారించుకోవడం జరుగుతుందని, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల ఓటర్లను నిర్ధారించడం జరిగిందని, మిగిలిన 12 లక్షల ఓటర్ల నిర్ధారణ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కేటగిరి సి, క్యాటగిరి డి లలోని ఓటర్లను కేటగిరి ఎ కు మ్యాపింగ్ చేసే ప్రక్రియను మెరుగుపరచాలని తెలిపారు. కాగా, అంతకుముందు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఈ.ఆర్.ఓలు, ఏ ఈ ఆర్ ఓ లు, బీఎల్ఓ సూపర్వైజర్లు, బీ ఎల్ ఓలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్ ఐ ఆర్ సన్నాహక ప్రక్రియ పురోగతిపై సమీక్ష జరిపారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా సరైన పద్ధతిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియను నిర్దిష్ట గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన విధులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. 2002 ఓటరు జాబితా, ప్రస్తుత 2025 ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆదివారం సాయంత్రం లోగా మ్యాపింగ్ పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వారీగా ఈ ప్రక్రియను బీఎల్ఓ లు సజావుగా పూర్తి చేసేలా బీ ఎల్ ఓ సూపర్వైజర్లు, ఏఈఆర్ఓ లు స్వీయ పర్యవేక్షణ.చేయాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
