
జనం న్యూస్ నవంబర్ 1 కాట్రేనికోన
ఆర్డబ్ల్యూఎస్ అధికారి కుంచే సుబ్రహ్మణ్యం కు రాష్ట్రముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు చేతులుమీదగా మొంతా తూఫాన్ ఫైటర్ అవార్డు లభించింది.మండలంలో అన్నిప్రాంతాలలో,ముఖ్యంగా తీరప్రాంతగ్రామాలకు మొంతా తూఫాన్ వలన త్రాగునిరు కొరత రానివ్వకుండా,ముందస్తు ప్రణాళికతో మండల ఆర్డబ్ల్యూఎస్ యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేసి ప్రజలకు అండగా ఉన్నందుకు గాను కుంచే సుబ్రహ్మణ్యం ఏ ఈ కు ముఖ్యమంత్రి అవార్డును అందచేశారు.కాట్రేనికోన ఆర్డబ్ల్యూస్ అధికారి సుబ్రహ్మణ్యం కు అవార్డు రావడంపట్ల పలువురు మండల ప్రజాపరిషత్ అధికారులు, మండల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ,అభినందనలు తెలిపారు.