
జనంన్యూస్. 02.నిజామాబాదు.ప్రతినిధి.శ్రీనివాస్ పటేల్..
నిజామాబాద్ వినాయక్ నగర్ లోని బసవ గార్డెన్ లో అమేచూర్ టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. టైక్వాండో చైర్మన్ బసవ లక్ష్మీ నరసయ్య. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పిల్లలకి చదువుతోపాటు తైక్వాండలాంటి విద్య ఎంతో అవసరమని తైక్వాండో నేర్చుకోవడం వల్ల వారు క్రమశిక్షణ మంచి తెలివి శారీరికంగా మానసికంగా అన్ని రంగాల్లో ముందుంటారు రానున్న ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించి. మన నిజామాబాద్ కి మన తెలంగాణకి మంచి పేరు తీసుకురావాలని పిల్లల తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కోచ్ మనోజ్ ని అభినందించారు బెల్ట్ పరీక్షల్లో పాల్గొన్న ప్రతి పిల్లలకి బెల్టు అందజేస్తూ సర్టిఫికెట్లు అందజేశారు.