
జనం న్యూస్ 02 నవంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం డి.ఆర్.డి.ఏ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సందర్శించారు. ఇప్పటివరుకు 65 శాతం పంపిణీ జరిగిందని తొలిరోజే 90 శాతం వరకు పంపణీ చేస్తున్నామని డి.ఆర్.డి.ఏ ఏపిడి సావిత్రి కలెక్టర్‌కు వివరించారు. ప్రతీ అరగంటకు తమకు సమాచారం పంపాలని, సాయంత్రానికి శతశాతం పంపిణీ జరిగేలా చూడాలన్నారు.