
జనం న్యూస్ నవంబర్ 2 నడిగూడెం
మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం 24వ వార్షికోత్సవ వేడుకలు నవంబర్ 3 తేది నుంచి 5 తేది వరకు జరగనున్నాయి. 3న సాయి సత్య వ్రతాలు, 4న సుప్రభాత సేవ, సాయినామ సంకీర్తన, 5న సహస్రనామ పూజలు, మహా అన్నదానం నిర్వహిస్తామని అధ్యక్షులు రేపాల పురుషోత్తం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు.