
జనం న్యూస్ 03 నవంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా మొదటి మహాసభలు గద్వాల పట్టణంలో వాల్మీకి భవన్లో ఘనంగా జరిగాయి ఈ మహాసభలలో టియుసిఐ రాష్ట్ర కార్యదర్శి ఎస్ ఎల్ పద్మ అలాగే తెలంగాణ ప్రగతిశీల మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ…అంబానీ ఆదానిలా ఆస్తులను కాపాడుతూ కార్పొరేట్ సంస్థలకు మోడీ ప్రభుత్వం ఊడిగం చేస్తూ వాళ్ళ అప్పులను రద్దు చేస్తూ వారికి రక్షణగా ఉంటుంది దేశంలోని కార్మికులకు శ్రమను నమ్ముకోని పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదు సుప్రీంకోర్టు పిలుపు ప్రకారం కార్మికులకు 26 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా ఈ కార్మికులకు 3000 మాత్రమే ఇస్తుంది ఇది శ్రమను దోచుకోవడమే కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడుదారులకు సబ్సిడీలు ఇచ్చే వారిని ఆదుకుంటూ కష్టాన్ని నమ్ముకునే వారిని పొట్ట కొడుతూ వారికి కడుపు నింపడం లేదు తగిన జీతాలు ఇవ్వడం లేదు మధ్యాహ్న భోజన కార్మికులకు నెల నెల బిల్లులు ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు.గౌరవవేతనాలుసకాలంలో చెల్లించడం లేదు గుడ్డు రేటు తక్కువగా ఇవ్వడంతో గుడ్డును వడ్డించడంలో కార్మికులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి కావున కోడి గుడ్డును ప్రభుత్వమే సరఫరా చేయాలి..కార్మికులకు ఇ యస్ ఐ పి యాప్ సౌకర్యం కల్పించాలి నెల నెల వేతనాలు జీతాలు ఇవ్వాలి గుర్తింపు కార్డు ఇవ్వాలి వంట పాత్రలు ఇవ్వాలి కాబట్టి గిట్టటం లేదు రెండు రకాల కూరల విధానానికి స్వస్తి పలకాలి లేదా సరిపడా బిల్లులు చెల్లించాలి మెనో బిల్లులు గౌరవ వేతనాలు పెంచాలి ఈ కార్యక్రమంలో టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు హనుమంతు జిల్లా కార్యదర్శి చింతరేవుల కృష్ణ , మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గజ్జల కృష్ణ హరీషు చంద్రాములు, రంగన్న, చాంద్ బాషా, భాష, రాజు తదితరులు పాల్గొన్నారు