
జనం న్యూస్ నవంబర్ నవంబర్ 2:నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము:
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఏర్గట్ల పోలీస్ స్టేషన్ ఎస్ఐ పడాలరాజేశ్వర్ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలనే అవగాహన కల్పించడానికి స్వయంగా ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించారు.ఈ షార్ట్ ఫిల్మ్‌ను ఆదివారం రోజునా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ హెల్మెట్‌ను తప్పనిసరిగా వాడాలని, తమ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.హెల్మెట్ వాడకం పై అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్ రూపొందించిన ఎస్ఐ రాజేశ్వర్ ని మరియు ఆయన బృందాన్ని కమిషనర్ అభినందించారు.
