
బిచ్కుంద నవంబర్ 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్లో మంగళవారం నాడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మరియు సొసైటీ చైర్మన్ బాలాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ సోయా క్వింటాలుకు రూ.5,328/- ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని చెప్పారు..ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు అని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతరావు విజ్ఞప్తి చేశారు. అనంతరం సొసైటీ చైర్మన్ బాలాజీ ఎమ్మెల్యే గారిని శాలువాతో సత్కరించారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డెలికేట్ విట్టల్ రెడ్డి, బిచ్కుంద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, బిచ్కుంద పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్కార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి, సిద్ధప్ప పటేల్, అసద్ అలీ, ఖలీల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, సోపాన్ సార్, దశరత్ స్వామి, సీమ గంగారాం జలీల్ అజీమ్, వికాస్ నాయక్, సొసైటీ డైరెక్టర్ చంద్రకాంత్ పటేల్, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ రావు, సొసైటీ సీఈఓ శ్రావణ్ కుమార్, మార్కెట్ కమిటీ సెక్రటరీ రాజకుమార్, మార్కెట్ సిబ్బంది మరియు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు
