
(జనం న్యూస్,3 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి )
యువత ఆరోగ్యం పై చైతన్యం పెరుగుతున్న గ్రామాల్లో వ్యాయామశాల లేక యువకులు ఇబ్బంది పడుతున్నారు ఉదయం సాయంత్రం సమయంలో వ్యాయామం చేయాలని ఆసక్తి ఉన్న సరైన సదుపాయం లేక బయట ప్రదేశాలు శరీర శ్రమ చేస్తున్నారు కొంతమంది యువకులు తాత్కలంగా ఇళ్ల వద్ద బరువులు రాడ్లు వాడుకుంటూ శరీరాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ పరికరాలు లేకపోవడం వల్ల పూర్తి వ్యాయామం సాధ్యం కాలేకపోతున్నాయి గ్రామంలో ఒక జిమ్ము ఉంటే యువత ఆరోగ్యంగా ఉంటారు చెడు అలవార్లకు దూరంగా ఉంటారని యువకులు కోరుకుంటున్నారు స్థానిక నాయకులు వ్యాయామాలు నిర్మాణానికి ప్రభుత్వం సహక రించాలని డిమాండ్ చేస్తున్నారు