
తేదీ: 03-11-2025 హయత్ నగర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం జనం న్యూస్ ప్రతినిధి: 9640204826
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ సమీపంలో ఆర్టీసీ బస్సు – కంకర టిప్పర్ ఢీకొని జరిగిన రోడ్డు ప్రమాదం ఎంతో విషాదకరమని ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి మాజీ కౌన్సిలర్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పొట్టి రాములు అన్నారు.ఈ దుర్ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ,మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాలని అని డిమాండ్ వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలిని వైద్యులకు సూచించారు. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని అన్నారు పొట్టి రాములు ఆదిభట్ల మున్సిపాలిటీ బీజేపీ మాజీ కౌన్సిలర్, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి