విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనల పెంపుదలకు టాలెంట్ టెస్టులు దోహదపడతాయి
మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు అన్నారు
జనం న్యూస్ ఫిబ్రవరి 01 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్
ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ (ఎఫ్ పి ఎస్ టి)వారి నేతృత్వంలో మునగాల మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్ ఆన్ లైన్ పరీక్ష పత్రాన్ని గూగుల్ ఫామ్ ద్వారా మండల విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, సి.వి. రామన్ వంటి శాస్త్రవేత్తల కృషి గురించి తెలుసుకొని విద్యార్థులు రేపటి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.మండల స్థాయి ఫిజికల్ సైన్స్ పరీక్ష సమన్వయకర్త గోళ్ళమూడి రమేష్ బాబు సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో, ప్రత్యేక అతిథిగా హాజరైన మాజీ మండల విద్యాధికారి ఓరుగంటి రవి మాట్లాడుతూ.. మోడరన్ టెక్నాలజీ ద్వారా ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు
గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థులు తదుపరి జిల్లా స్థాయి పోటీల లోనే కాకుండా, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ చూపి మునగాల మండలానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. టాలెంట్ టెస్ట్ విజేతలుగా నరసింహులగూడెం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి పోకల సాయి మండల ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నాడు ద్వితీయ, తృతీయ స్థానాల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గణపవరం విద్యార్థులు జి. నిఖిల్, షేక్ అన్వర్ పాషా నిలిచారు.మండల స్థాయిలో మొదటి మూడు స్థానాలను సాధించిన విద్యార్థులకు ఫిబ్రవరి 4వ తేదీన సూర్యాపేట లో జిల్లా స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహిస్తామని ఫిజికల్ సైన్స్ ఫోరం నాయకులు బి.వి. రమేష్ కుమార్ తెలిపారు.