
మద్నూర్ నవంబర్ 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని కృష్ణ నేచురల్ ఫ్యాక్టరీ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రం ను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంత్ రావు సోమవారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “రైతుల ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది. ఒక క్వింటాల్ పత్తిని 78,110కు కొనుగోలు చేస్తోంది" అని తెలిపారు. రైతులకు న్యాయమైన ధర, పారదర్శక కొనుగోలు, సకాలంలో బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి రైతు ధైర్యంగా పత్తి విక్రయించాలని ఆయన పిలుపునిచ్చారు.కార్యక్రమంలో పాల్గొన్నవారు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా మార్కెట్ కమిటీ అధికారిణి, మార్కెట్ చైర్మన్ సౌజన్య రమేష్ ఓబీసీ రాష్ట్ర నాయకుడు సాయి పటేల్, మార్కెట్ వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, సింగిల్ విండో చైర్మన్ సీనూ పటేల్, మండల పార్టీ అధ్యక్షుడు సాయిలు, రమేష్ వటనల్ వార్, మీర్జాపూర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్,కొంద గంగాధర్,హన్మాండ్లు స్వామి, గోపి,నగేష్ పటేల్,బాలు షిండే ఇక ఫ్యాక్టరీ యాజమాని రాజేష్ కాకనీ, మార్కెట్ కమిటీ సెక్రెటరీ, రాజ్ కుమార్ మార్కెట్ కమిటీ అధికారులు సిబ్బంది మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
