
జనం న్యూస్, నవంబర్ 3, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ గ్రామం లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ దేవాలయం 24 వ వార్షికోత్సవానికి రావాలని దేవాలయం ఈఓ రవి కుమార్,ఆలయం చైర్మన్ అనుగీత ,స్థానిక గ్రామ మాజీ సర్పంచ్ రజిత రమేష్, సిద్దిపేట ఐపీఎస్ విజయ్ కుమార్ ను కోరారు,ఈమేరకు సిద్దిపేటలోని ఐపీఎస్ విజయ్ కుమార్ ను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. నవంబర్ 10 నుంచి 12 వరకు జాతర జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయం సిబ్బంది కనకయ్య ఉన్నారు.