
జనం న్యూస్ :నవంబర్ 3 సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వైరమేష్ :
స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన (అటానమస్) సిద్దిపేట డిగ్రీ కళాశాల పాఠ్య పుస్తకాలలో ప్రముఖ రచయత, కథాశిల్పి, జాసాప ఉపాద్యక్షులు ఐతా చంద్రయ్య రచించిన "మంచుముద్ద" కథకు చోటు దక్కినందుకు జాసాప సిద్దిపేట కార్యవర్గం ఆదివారం శాఖ గ్రంథాలయం సిద్దిపేటలో అభినందలు తెలిపారు. ఈసందర్బంగా జాసాప అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ కథా సాహిత్యంలో ఐతా చంద్రయ్య రచనలు అమౌఘమని, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కథలు చంద్రయ్య కలం నుండి జాలువారాయని, జాతీయ స్థాయి అవార్డులు ఐతా చంద్రయ్యకు లభించాలని ఆకాంక్షించారు. కథాశిల్పి ఐతా చంద్రయ్య మాట్లాడుతూ తన రచన మంచుముద్ద కథ 1995లో రాయడం జరిగిందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన గ్రంథం ద్వారా ఇట్టి కథ ప్రచురితం కావడం వల్ల ఏడు భాషల్లో అందుబాటులో ఉందన్నారు. తన రచన మంచుముద్ద కథ డిగ్రీ కళాశాల తెలుగు పాఠంగా ఎంపిక చేయడం పట్ల ప్రిన్సిపల్ తెలుగు శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కవులు పెందోట వెంకటేశ్వర్లు, వరుకోలు లక్ష్మయ్య, బస్వ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కు జాసాప అభినందనలు*.