
జనం న్యూస్ నవంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి 84 వ వార్డు రఘురామ్ కాలనీలో అక్కడ నివాసం ఉంటున్న ప్రజలు అభ్యర్థన మేరకు కాలువలు రోడ్లు లేకపోవడం వల్ల రాత్రి సమయంలో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల కాలంలో అపార్ట్మెంట్లు ఎక్కువ రావడంతో వాడుక నీరు వెళ్లే మార్గాలు లేక దోమల బెడద ఎక్కువగా ఉందని నా దృష్టికి తీసుకు రావడంతో శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పిలా గోవింద సత్యనారాయణ దృష్టికి తీసుకు రావడంతో జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రధాన కమిషనర్ కేతన్ గార్గే కోటి యాభై లక్షలు నిధులు మంజూరు చేశారని కార్పొరేటర్ మాదంశెట్టి చిన్న తల్లి నీలబాబు తెలియజేశారు. నిధులు మంజూరు అవడంతో సోమవారం ఉదయం రఘురాం కాలనీలో సిమెంట్ రోడ్లు కాలువలు కు కార్పొరేటర్ చిన్న తల్లి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు తలారి ప్రసాదు ప్రధాన కార్యదర్శి సాలాపు మోహన్ పార్టీ నాయకులు కోట్ని రామకృష్ణ కోట్ని రాంబాబు బత్తుల శ్రీను నమ్మి రామారావు జనసేన నాయకులు సిహెచ్ ప్రసాద్ మధ్య శ్రీను మడగల శ్రీను ఇంజనీరింగ్ అధికారులు వర్క్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.//