
జనం న్యూస్, నవంబర్ 04,అచ్యుతాపురం: ఆశా కార్యకర్తల 5వ
రాష్ట్ర మహాసభలు మొట్టమొదటిసారి అనకాపల్లిలో ఈనెల 8,9 తేదీల్లో జరిగే మహాసభల గోడ పత్రికను అచ్యుతాపురంలో ఆశా వర్కర్లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అచ్యుతాపురం సీఐటీయూ మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల నుండి 300 మంది ఆశా కార్యకర్తలు మహాసభకు హాజరుకానున్నారని,ఈ మహాసభలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తల సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాటాలకు దిశా నిర్దేశం చేయడం జరుగుతుందని,ఆశా కార్యకర్తలు ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నారని,వీరికి కనీస వేతనాలు అమలు కావడం లేదని,పనిభారం విప రీతంగా పెరిగిందని పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా కార్యకర్తలను పెంచి రాజకీయ వేధింపులు ఆపాలని ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ నాయకులు ధర్మిరెడ్డి సరోజినీ, ఎస్ సూర్యలక్ష్మి, ఎం దేవుడమ్మ, పైడమ్మ,పల్లవి,వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.