
జనం న్యూస్ నవంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఇటీవల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ను అతలాకుతలం చేసి నర్సాపురంలో తీరం దాటిన
మొంత తుఫాన్ పరిస్థితుల్లో కాట్రేనికోన మండలం, గచ్చాకాయల పోర సముద్ర తీర ప్రాంతం నుండి వలస వచ్చిన మత్యకార కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తాము తమ నివాశ గృహాలను వదిలి రామంటున్న ప్రజలకి పోలీసులు నచ్చచెప్పి గచకయలపొర తుఫాను షెల్టరుకు తరలించినారు. అలాగే మగసాని తిప్ప బలుసు తిప్ప చిరయానం సురక్షిత ప్రాంతాలకు తరలించారు అత్యుత్తమ సేవలు
ప్రదర్శించినందుకు కాను ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మోహన్ కుమార్ కు ఉత్తమ సేవా అవార్డు లభించింది ఆ మేరకు అమలాపురంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా చేతుల మీదుగా మొంత తుఫాను సమయంలో అందించిన అత్యుత్తమ సేవలకు గాను ఉత్తమ సేవా అవార్డు అందుకున్నారు ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుల్లో రెవెన్యూ యంత్రాంగం పోలీసు శాఖ వారు విద్యుత్ శాఖ వారు మరియు అన్ని శాఖల సిబ్బంది అందరూ సమన్వయంతో పని చేశారని శ్రీ జిల్లా కలెక్టర్ కితాబునిచ్చారు
